డోన్: సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకం :డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
Dhone, Nandyal | May 8, 2026 సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మెప్మా ఆర్పీలకు డస్ట్బిన్లు, ఎరువులు, కెమికల్స్, ట్యాబ్ల నిర్వహణ కోసం సిమ్ కార్డులను ఆమె పంపిణీ చేశారు.