కరీంనగర్: నగరంలోని మహాశక్తి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరెన్సీ నోట్లతో అలంకరణ, లక్ష్మి అవతారంలో అమ్మవారు
కరీంనగర్ నగరంలోని మహాశక్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం కరెన్సీ నోట్లతో లక్ష్మి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. 500, 200, 100, 50, 20, 10 రూపాయలను నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా భవాని మాలధారుల కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.