ఒంగోలు అర్బన్: రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలను గురించి చర్చించిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి
Ongole Urban, Prakasam | May 7, 2026
ఒంగోలు రామ్ నగర్ లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంతో పాటు సూరారెడ్డిపాలెం టంగుటూరు తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా పలు రైల్వే బ్రిడ్జిల నిర్మాణంతోపాటు కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు రైల్వే అధికారులు రైల్వే ఎస్పీ సుందర్ సింగ్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు మారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొనారు.