డోన్: భక్తులతో కిక్కేసిన మద్దిలేటి స్వామి ఆలయం
Dhone, Nandyal | May 2, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైశాఖమాసం శనివారంతో పాటు వేసవికాలం సెలవులు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గండ దీపాలు మోసి, మొక్కుబడులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు.