రాజేంద్రనగర్: బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు వంగాల కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే ఎన్నికల్లోకి వెళ్లాలని ఆలోచిస్తుందని అన్నారు