నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు గ్రామం నుంచి సుద్దపల్లెకు వెళ్లే రస్తాలో ఉన్న పంట పొలాల్లో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కనిపించింది, పంట పొలాల్లోకి పనుల నిమిత్తం వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించారు, మృతదేహం కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారం చేరవేశారు, మృతుడు గత రెండు రోజులుగా పంట పొలాల్లోనే సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు, కేసు నమోదు చేసుకొని మృతుడి వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు