ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడి సేవలు కీలకం : ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ని 11 12 13 అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో గోకుల కృష్ణ దేవాలయంలో కిషోర్ వికాసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరి అమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపి చిన్నారుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు, కిశోర బాలికలు, వారి తల్లులకు బాల్య వివాహాల నివారణ, ఫోక్సో చట్టం, అనీమియా నివారణ, శారీరక వ్యాయామం, తదితర వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చిన్నారుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు