ఆళ్లగడ్డ: బత్తలూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని బత్తులూ రు గ్రామం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, సిరివెళ్ల కు చెందిన లింగ మోహన్ శ్రీనివాసులు బైక్ వెళ్తుండగా అకస్మాత్తుగా బర్రె అడ్డూ రావడంతో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లింగమోహన్ ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలుకోలేక బుధవారం మృతి చెందాడు, మృతుడి కుటుంబంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు