నారాయణపేట్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి: టియుసిఐ జిల్లా కార్యదర్శి బోయిన్ పల్లి రాము
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి బోయిన్ పల్లి రాము అన్నారు. కార్మికులు తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని దసరా పండుగకు కూడా వస్తువులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు.