గుంతకల్లు: గుత్తిలో గొర్రెలు చోరీలకు పాల్పడే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, 16 గొర్రెలు స్వాధీనం, కేసు నమోదు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలో గొందిపల్లి గ్రామంలో గొర్రెల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరిని గుత్తి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొందిపల్లి గ్రామంలో గొర్రెలు చోరీలు ఏడు మంది నుంచి ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీలకు పాల్పడిన దొంగలు గుత్తి ఫోర్ట్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న బయలు ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం అందింది. దాడులు చేసి రూ.1.92.000 విలువ చేసే 16 గొర్రెలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు.