ధర్మవరం పట్టణంలో గ్రామ సింహాల దెబ్బకు బెంబేలెత్తుతున్న ప్రజలు.
ధర్మవరం పట్టణంలో వీధి కుక్కల కాటుకు పలువురు చిన్నారులు గాయపడి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా సుమారు 16 మంది వరకు కుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కుక్కలను నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బాధితుల తల్లిదండ్రులు వాపోయారు. మున్సిపాలిటీ నిధుల్లో 18 లక్షలు ఖర్చుపెట్టి కుక్కలను తరలిస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.