కర్నూలు: ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆరోగ్య శ్రీ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,700 కోట్ల బకాయిలు ఉండటంతో ప్రైవేట్ హాస్పటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారన్నారు.