బనగానపల్లె: ఈనెల 9న బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ పరిధిలో ఈనెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారంపేర్కొన్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు సీఎం చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు రైతుల పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.