జహీరాబాద్: జహీరాబాద్ లో ఈనెల 25న ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యత మార్చ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఈనెల 25న ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐక్యత మార్చ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని ఎంఆర్హెచ్ఎస్ మైదానంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఐక్యత మార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే మాణిక్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో యువత, విద్యార్థులు, అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.