జహీరాబాద్: సత్వార్ వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లిన లారీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సమయంలో మహారాష్ట్ర వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చిరాగ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది