హత్నూర: నర్సాపూర్, హత్నూరలోఎక్త దివాస్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ,2k రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు పోలీస్ సిబ్బంది
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో హత్నూర మండలంలోని కాసాల దౌలతాబాద్ ప్రధాన రోడ్డుపై ఎట్టా దివాస్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2k రన్ ను శుక్రవారం నిర్వహించగా యువకులు, విద్యార్థులు పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ జాన్ రెడ్డి ఎస్సైలు రంజిత్ కుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ దేశం కోసం పటేల్ చేసిన సేవలు నేటి యువతకు మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.