అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని వడియం పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరికీ గాయాలు
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగర శివారులోని వడియం పేట వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నాగుల గూడెం తండాకు చెందిన శంకరమ్మ తో పాటు జయరాం నాయక్ అనే యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.