ఒంగోలు అర్బన్: పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 23, 2026
పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని, "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న "ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం" కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు చేపట్టిన పారిశుద్ధ్య అధికారులు పాల్గొన్నారు