అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్ కు చెందిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్ కు చెందిన నిరంజన్ కుమార్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో నాలుగవ పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.