పుంగనూరు: గాండ్లపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి చోరీ చేసిన గుర్తుతెలియని దుండగులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి లో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి హుండీని పగలగొట్టి నగదును దొంగలించారు . నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలతో పాటు ప్రతి ఆదివారం పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసి హుండీలో నగదు వేస్తారు. ఈ తంతును గమనిస్తూ వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హుండీపగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.