ఒంగోలు అర్బన్: ఒంగోలులోని మంగమూరులో యువకుడు దారుణ హత్య, నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్
Ongole Urban, Prakasam | Jun 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మంగమూరులో అశోక్ అనే యువకుడిని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. నిన్న క్రికెట్ కి వెళ్లి ఇంటికి వచ్చిన అశోక్ ని అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.