సైదాపూర్: సైదాపూర్ ,వెన్నపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు రైతులు సోమవారం తెలిపారు. సోమవారం ఉదయం నుంచి యూరియా కోసం క్యూ లైన్ కట్టారని, ఇతర గ్రామాలనుంచి కూడా రైతులు సొసైటీ వద్దకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తే కొంతమందికే యూరియా వచ్చిందని తెలిపారు. యూరియా సరఫరాలో జాప్యం కారణంగా విసుగు చెందిన రైతులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.