వీరేపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన...
ఉలవపాడు (M) వీరేపల్లిలోని మోడల్ స్కూల్లో రోడ్డు ప్రమాదాల నివారణ అంశంపై అధికారులు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా బైకులను, కార్లను డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ అంకమ్మ, కందుకూరు MVI అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.