కర్నూలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి.ఎం. రమేష్ మాదిగ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా టి.ఎం. రమేష్ మాదిగ మాట్లాడుతూ, “చీఫ్ జస్టిస్‌పై జరిగిన దాడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థపై జరిగిన దాడి” అని పేర్కొన్నారు. దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయమూర్తులు, ప్రభుత్వాధికారులకు రక్షణ కల్పించాలని కేంద్ర