బోయిన్‌పల్లి: అనంతపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంత పల్లి గ్రామ శివారులో గురువారం 6:20 PM కి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,దసరా పండగకి వేములవాడకు చెందిన కిష్ట స్వామి తన మోపెడ్ వాహనంపై అనంతపల్లి నుండి తిరిగి వేములవాడకు వెళుతుండగా,వాటర్ ట్యాంక్ మూలమలుపు సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ రావడంతో ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్న కృష్ణస్వామి రోడ్డు దిగుతుండగా అదుపుతప్పి పడిపోయాడు,దీంతో రెండు కాళ్ళకి తీవ్ర గాయాలయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన క్రిష్ట స్వామిని,అదే ట్రాక్టర్లో చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో వేములవాడకు తరలించారు,ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది,