భీమవరం: డి.ఎన్.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు, పాల్గొన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో డి.ఎన్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కళాశాలలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు, కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాహుల్ కుమార్ రెడ్డి తమ ప్రసంగంలో మాట్లాడుతూ నేటి ఇంజనీరింగ్ రంగంలో జరుగుతున్న తాజా మార్పులు, సాంకేతిక ఆవిష్కరణల గురించి వివరించారు.