కర్నూలు: కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందే అని న్యాయవాది బి.చంద్రుడు డిమాండ్
కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందే అని న్యాయవాది బి.చంద్రుడు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూల్ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో 2వ రోజు రిలే దీక్ష నిర్వహించారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కళాశాల విధానాన్ని నిర్వహించి పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు.