ఒంగోలు అర్బన్: రైతు బజార్ లను బలోపేతం చేయాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | May 1, 2026
రైతు బజార్లను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉద్యాన పౌరసరఫరాలు మున్సిపాలిటీ తూనికలు మరియు కొలతలు మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు రైతు బజార్లో ఎస్టేట్ అధికారులతో శుక్రవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు వారి కూరగాయలను రైతుబజార్లలో ప్రత్యక్షంగా గాని ఆసక్తి కలిగిన వారి ద్వారా మంచి ధరకు అమ్ముకోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్టేట్ అధికరణ ఆదేశించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహిస్తూ ప్రతి రైతు బజార్ నందు స్టాల్స్ కేటాయించాలని మరియు స్వయం సహాయక గ్రూపులకు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు