సంతనూతలపాడు: దోమకాటువలన విద్యార్థులకు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంతనూతలపాడు మండలం మద్దులూరు బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు తెలిపారు. బీసీ హాస్టల్లో దోమలు బయట నుండి హాస్టల్ లోకి జొరబడకుండా కిటికీలకు నెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కిటికీలకు ఏర్పాటు చేస్తున్న నెట్స్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీహరి ఆదేశాలతో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వార్డెన్ అన్నారు.