నందికోట్కూరు: తలముడిపి గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి బిడుగు పక్కిరయ్య కుమారుడు బిడుగు రంగస్వామి(29) ఉదయం ఏడు గంటలకు భార్య మహేశ్వరి కూలీ పనికి వెళ్ళింది.తిరిగి మ 12 గంటలకు భార్య ఇంటికి వచ్చి తలుపులు తెరువగా ఇంట్లో ఫ్యాన్కుఆత్మహత్యచేసుకున్నాడు.మృతునిభార్య మహేశ్వరి ఇద్దరు కూతుర్లు ఉన్నారు,రంగస్వామికి గత కొన్ని రోజులుగా పసిరికలు అనారోగ్య కారణంగా మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.