కోడుమూరు: కే నాగలాపురం సుంకులా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రులు వైభవంగా ప్రారంభం
గూడూరు మండలంలోని కే నాగలాపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ సుంకులా పరమేశ్వరి దేవి ఆలయంలో సోమవారం దేవాదాయ శాఖ అధ్వర్యంలో దసరా నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలో వేద పండితులు గణపతి హోమం, పూజ నిర్వహించారు. అమ్మవారికి అభిషేకములు, ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పాల్గొన్నారు.