నందికోట్కూరు: నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి కొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారి వీల్ చైర్లు విరాళం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారి నాగరాజు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు, తన తండ్రి జ్ఞాపకార్థం నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వృద్ధులకు రోగులకు సౌకర్యార్థం రెండు వీల్ చైర్లను సోమవారం నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి విరాళంగా అందజేసినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ జక్కి వైద్య సిబ్బంది పాల్గొన్నారు