తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం వాంపల్లి పరిధిలో ఉన్న సోమన్య టైల్స్ ఫ్యాక్టరీలోప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోవర్కర్స్ పనిచేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడ విధుల్లో ఉన్నఇద్దరు కార్మికులు మృతి చెందారు. చీరాల పండా కి చెందిన గున్నాటి పోతురాజు,ఒరిస్సాకి చెందిన మరోవ్యక్తి మృతి చెందారు. . మృతదేహాలను 108 ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.