సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో ని ఇస్మాల్కంపేట్, కల్పగూర్, ఫసల్ వాది, కంది సదాశివపేట, హత్నూరం మండలంలోని కాసాల దౌల్తాబాద్ మల్కాపూర్ మంగాపూర్ హత్నూర తదితర గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి వరకు వర్షం భారీగా కొరయడంతో మంజీరా పరివాహ గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు భారీ వర్షాలనిపత్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.