సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిర్వహించిన బందు ప్రశాంతం
తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బందుకు సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బందు ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీసీ నాయకులు వివిధ పార్టీల నాయకులు బందులో పాల్గొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వడంతో వాణిద్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు,