అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని సరళ దేవి కాలనీకి చెందిన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగర శివారులోని సరళ దేవి కాలనీకి చెందిన హసీనా అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆమె తన భర్తతో వాగు వివాదానికి దిగి తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆమెను వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అత్యవసర వైద్య విభాగంలో శనివారం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.