కడప: తిరుపతిలో జాతీయ మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసన సభ కమిటీల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Kadapa, YSR | Sep 14, 2025 తిరుపతిలో తొలిసారిగా రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారి ఆధ్వర్యంలో “వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్నారు.మహిళా ప్రజాప్రతినిధుల ఎదుగుదల మరియు సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత ప్రాధాన్యతపై చర్చలు జరిగాయి.