దాచేపల్లి పట్టణంలో చరిత్ర కలిగిన నాగులేరు ఎర్ర నీటితో ఉరకలు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి కి జీవనాడి అయినా చరిత్ర కలిగిన నాగులేరు వాగు భారీ వర్షాల కారణంగా ఉరకలెత్తి ప్రవహిస్తుంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ఎర్ర మట్టితో కూడిన వరదనీరు రావడంతో నాగులేరు ఎరుపు రంగులో ఆదివారం సాయంత్రం 5:00 సమయంలో ప్రవహిస్తుంది. నాగులేరులో వరద ఉధృతి పెరగడం వల్ల దాచేపల్లి ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయని పంటలకు పశువులకు సరిపడినంత సాగు తాగునీరు లభిస్తుందని పలనాడు ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.