ఒంగోలు అర్బన్: యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం:ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Jun 9, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ రాయిపాటి ప్రసాద్ రావు, యోగా మాస్టర్లు గోపాల రెడ్డి, టి. వెంకట లక్ష్మీ ప్రసన్న, అలాగే ఒంగోలు హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్‌కు చెందిన ఆలా మధుసూదన్, విజయలక్ష్మి గార్ల వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన పద్ధతులను వివరించారు