విశాఖపట్నం: మద్యం దుకాణం వద్ద తగాదా, ఇద్దరు మైనర్లు యువకుడిపై దాడి, కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు
మద్యం దుకాణం వద్ద తగాదా.యువకుడిపై దాడి, తీవ్ర గాయాలు. మద్యం దుకాణం వద్ద చోటు చేసుకున్న తగాదా చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఒకు యువకుడిపై మైనర్లు దాడి చేసి గాయపర్చారు. బాధితుడు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. మారికవలసకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ తన స్నేహితుడు రవితో కలిసి ఈ నెల 21న సాయంత్రం అక్కడి హర్ష వైన్స్ అనే మద్యం దుకాణానికి వెళ్లాడు. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న ఇద్దరు మైనర్లు నిజాముద్దీన్‌తో గొడవ పడ్డారు. మైనర్లు మద్యం దుకాణం వద్ద ఉండవద్దన్నందుకు గొడవపడ్డారు.