ఒంగోలు అర్బన్: ఒంగోలులో తమ జీతాలు పెంచాలని నిరసన తెలిపిన మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, కలెక్టర్కు వినతిపత్రం
Ongole Urban, Prakasam | Jun 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద తమ జీతాలు పెంచాలని సోమవారం మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు నిరసనకు దిగారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టి స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు పెంచాలని కోరుతూ కలెక్టర్కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు.