సంతనూతలపాడు: బాబు షూరిటీ మోసం గ్యారంటీ - సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి విస్తృతస్థాయి సమావేశం
బాబు షూరిటీ మోసం గ్యారంటీ సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మెరుగు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ బ్రోచర్లను ఆవిష్కరించారు. బాబు మోసాలను ప్రజల్లోనికి తీసుకొని వెళ్లే దిశగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.