పలమనేరు: వీ.కోట: బైక్ పై ప్రయాణిస్తూ గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్య అక్కడికక్కడే మృతి భర్తకు తీవ్ర గాయాలు
వి.కోట: మండల స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. కరేప్పల్లి గ్రామానికి చెందిన దంపతులు రమేష్ రెడ్డి భారతమ్మ ద్విచక్ర వాహనంలో వీ.కోట నుండి రాజుపేట రోడ్డు వైపు వస్తుండగా, గుర్తు తెలియని వాహనం వెనుక నుండి ఢీకొని భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.