ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ సస్పెండ్.. తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ప్రజలలో చర్చ
Ongole Urban, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలోని కార్యవర్గ కమిటీని పూర్తిగా రద్దు చేసినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కొద్దిగా రోజుల క్రితం జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని పై విమర్శలు చేయడమే పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తుంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన నాయకులను ఎవరిని పార్టీలో ఉంచమని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు పగ్గాలను బాలినేనికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.