ఖైరతాబాద్: గవర్నర్ కార్యాలయానికి నకిలీ రిపోర్టర్... మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
హైటెక్స్ గవర్నర్ కార్యక్రమానికి జాతీయ మీడియా ప్రతినిధిగా వచ్చానని చెప్పుకుంటూ ఓ అపరిచితుడు ప్రత్యక్షం అయ్యాడు. పరిశీలించగా అతను నకిలీ విలేఖరి అని బయటపడింది. అతడి వద్ద నుంచి పలువురు జాతీయ మీడియా సంస్థల లోగోలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆ మీడియా సంస్థల ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.