బిగ్బాస్-9 విజేతను ప్రకటించనున్న నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాగా గత ఏడాదిలో బిగ్ బాస్ విన్నర్ ప్రకటన సందర్భంగా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో విజేత ప్రకటన సమయంలో అభిమానుల మధ్య ఘర్షణలు జరిగి, వాహనాలు ధ్వంసమైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.