బనగానపల్లె: మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని బనగానపల్లె తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన రైతు సంఘం నాయకులు
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.క్వింటాకు రూ.2,400 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు సంజీవులు, శివయ్య పాల్గొన్నారు.