రాజేంద్రనగర్: నాగిరెడ్డిపల్లి లో కార్తీక పౌర్ణమి వేడుకలు
మహేశ్వరంలోని నాగిరెడ్డిపల్లిలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శివరామాంజనేయ ఆలయంలో గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు 1,006 దీపాలని వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, యువకులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. దీపోత్సవం అనంతరం లింగాష్టకం భజనలు చేశారు.