బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో నాపరాతి గనులలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో నాపరాతి గనుల్లో పనికి వెళ్లిన యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మెత నాగిరెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి (27) దిన చర్యలో భాగంగా నాపరాతి గనుల్లో పనికి వెళ్లాడు. పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు.