అనంతపురం అర్బన్: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంలో నుంచి పడి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడడంతో రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం ఎర్రంపల్లి కి చెందిన సరితమ్మ అనే యువతి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.